ట్విట్టర్లో ప్రచారం అయ్యేవాటిలో 91 శాతం తప్పుడు వార్తలేనట!

  • అత్యవసరాల్లో సమాయాల్లో చాలా మంది చేస్తున్న పని ఇదే
  • సందేహం వ్యక్తం చేస్తున్న వారు తక్కువ మందే
  • అమెరికాలో జరిగిన అధ్యయనం
ట్విట్టర్ సామాజిక మాధ్యమం గాలి వార్తలకు వేదికగా నిలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా ట్విట్టర్ యూజర్లు వ్యాప్తి చేసే వార్తల్లో 86-91 శాతం తప్పుడువేనని అమెరికాలో ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో చాలా మంది యూజర్లు ఫేక్ వార్తలను రీట్వీట్ చేస్తూ లేదా లైక్ కొడుతున్నారట. ఈ అధ్యయనం వివరాలు జర్నల్ నేచురల్ హజార్డ్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి.

కేవలం ఐదు నుంచి తొమ్మిది శాతం మంది యూజర్లు మాత్రమే తప్పుడు వార్తా? కాదా? అని వచ్చిన వార్తను రీట్వీట్ చేసి నిర్ధారించుకుంటున్నట్టు అధ్యయనకారులు గుర్తించారు. కేవలం 1-9 శాతం లోపు వారు వార్తల కచ్చితత్వంపై సందేహం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ఇక తప్పుడు వార్తలను వ్యాప్తి చేసిన వారిలో పది శాతం మంది వరకు తర్వాత వాటిని డిలీట్ చేస్తున్నారట.
Go Back to Shorts
twitter
false news

More Telugu News